అన్నమయ్య: కే. వీ.పల్లి మండలంలోని నూతన కాలువ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరకణంపల్లికి చెందిన శివ (35) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి తన స్వగ్రామానికి బుల్లెట్ బైక్పై వస్తుండగా, నూతన కాలువ వద్ద వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. స్థానికులు, బంధువులు వెంటనే 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.