KRNL: మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటికే నలుగురి మృతదేహాలను వెలికితీసిన SDRF బృందాలు.. ఆదివారం సాయంత్రం రాఘవేంద్ర(25) మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశాయి. దీంతో ఎంఆర్వో రమాదేవి, సీఐ దస్తగిరి ఆధ్వర్యంలో కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.