PDPL: యైటీంక్లైన్ కాలనీ తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంలోని శ్రీ రంగనాయక ఆలయంలో 8వ కాలనీకి చెందిన వికాస తరంగణి ఆధ్వర్యంలో ఆదివారం పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 మంది మహిళలు పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.