MDK: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జూన్ 1 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్–1861లోని సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు.