AP: మోదీ, చంద్రబాబు హయాంలో ధరల బాదుడు కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. ఇంధన ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులు కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. KG బేసిన్లో ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్లో 50 శాతం ఏపీకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.