NTR: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు జరగనున్న ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు NTR జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. ఫుట్బాల్ కోర్టు, కార్ గ్రౌండ్, అంబేడ్కర్ కళావేదిక, కొలుసు పార్థసారథి గ్రౌండ్, సీఎస్ఐ చర్చి, టీటీడీ రోడ్, సిద్ధార్థ అకాడమీ, బిషప్ ఆజరయ్య స్కూల్ ఆవరణలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.