E.G: నిడదవోలుకు చెందిన రాంకీ హీరోగా పరిచయం అవుతున్న ‘సీతామాలచ్మి గారి అబ్బాయి’ చిత్రం ఫస్ట్ లుక్, డెమో ఫిల్మ్ పోస్టర్‌ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. యువ బృందం రూపొందించిన ట్రైలర్, డెమో ఫిల్మ్‌ను వీక్షించిన మంత్రి, వారి ప్రతిభను ప్రశంసిస్తూ సరైన బడ్జెట్, నిర్మాత లభిస్తే ఈ టీమ్ అద్భుతాలు సృష్టిస్తుందని అన్నారు.