IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ పోరాటం ముగిసింది. అద్భుత ఆటతీరుతో ఎలిమినేటర్‌లో SRHను ఓడించిన RR.. GTతో జరిగిన క్వాలిఫయర్-2లో మాత్రం తడబడింది. బ్యాటింగ్‌లో 214 పరుగులు చేసినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా విఫలమవడంతో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా, ఈ సీజన్ మొత్తం అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో సీజన్‌ను ఘనంగా ముగించాడు.