TG: రైతుల ప్రతి ధాన్యపు గింజనూ, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. మంథని మార్కెట్ యార్డును పరిశీలించిన ఆయన.. ప్రభుత్వ గోదాములు సరిపోకపోతే ప్రైవేట్ గోదాములు వాడుతామన్నారు. BJP, BRS పార్టీలు రైతులపై రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయమంటే పండుగని, వాణిజ్య పంటలు వేసి లాభాలు పొందాలని కోరారు.