SDPT: బెజ్జంకి మండలం రేణుకుంటలోని మొయ్యతుమ్మెద వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. SI తోట తిరుపతి ఆధ్వర్యంలో పట్టుబడిన దున్నపోతుల రాజును తహసీల్దార్ శ్రీకాంత్ ఎదుట హాజరు పరచగా బైండోవర్ చేశారు. ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించే అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.