SDPT: మానవ వికాసానికి యోగా ఒక అద్భుత ఔషధం లాంటిదని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోమటి చెరువు వద్ద జరిగిన యోగా శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి విధ్వంసంతో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతున్న తరుణంలో యోగా అలవాటు చేసుకోవడం అత్యవసరమన్నారు. మనిషి జీవితంలో యోగా భాగం కావాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.