PPN: గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 11 అర్జీలు అందాయని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ.విజయశాంతి తెలిపారు. శుక్రవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం లోని ‘గిరిమిత్ర’ హాల్లో గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల సమస్యలను తమ దృష్టికి తీసుకువెళ్ళారు.