SKLM: నగర మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్గా పల్లి నల్లన్నయ్యను శుక్రవారం ప్రభుత్వం నియమించింది. కొద్ది రోజుల పాటు ఆయన ఇంచార్జ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నేటి మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కూడా శ్రీకాకుళం కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈయన ప్రస్తుతం జీవీఎంసీ లో విధులు నిర్వర్తిస్తున్నారు.