ప్రముఖ ఉర్దూ కవి బషీర్ బద్ర్ (91) మధ్యప్రదేశ్లోని భోపాల్లో కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. 1935లో యూపీలో జన్మించిన బద్ర్, అలీగఢ్ ముస్లిం వర్సిటీలో ఉర్దూ బోధకుడిగా పనిచేశారు. ఆయన మృతిపై MP సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.