HYD: సికింద్రాబాద్ గాంధీ IVF సెంటర్ మరో కుటుంబంలో ఆనందాలు నింపింది. భువనగిరి జిల్లాకు చెందిన రవి, సౌమ్య దంపతులు 9 ఏళ్లుగా సంతానం కోసం పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందినా ఫలితం దక్కలేదు. చివరకు గాంధీ ఆస్పత్రిలో చేసిన తొలి IVF ప్రయత్నంలోనే సౌమ్య గర్భం దాల్చి, 3.6 కిలోల బరువుతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.