TG: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో విముక్తిపై స్పందించనున్నారు. కాగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత సహా కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాకు విముక్తి లభించిన విషయం తెలిసిందే.