SKLM: ఆహారాన్ని వృధా చేయవద్దని పారూస్ మేకప్ స్టూడియో అధినేత ప్రిస్కిల్ల గిరిరాజ్ సూచించారు. ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఆహార భద్రతపై అవగాహన కోసమే ఈ దినోత్సవం అని, ఆహార కొరత వల్ల పోషకాహార లోపం పెరుగుతోందని ఆమె అన్నారు. మిగిలిన ఆహారాన్ని 8790944902 నంబర్‌కు సమాచారం ఇస్తే నిరుపేదలకు అందిస్తామన్నారు.