SDPT: ఈ నెల 23 నుంచి 27 వరకు సిద్దిపేటలో ఐదు రోజులపాటు సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బెజ్జంకి, జగదేవ్పూర్, వర్గల్, నంగునూరు మండలాలకు చెందిన 101 మంది సర్పంచులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, చెట్ల పెంపకం, వీధి దీపాల ఏర్పాటు, అభివృద్ధి పనుల నిర్వహణ వంటి అంశాలపై రిసోర్స్ పర్సన్లు రామకృష్ణారెడ్డి, సమ్మిరెడ్డి, మల్లికార్జున్, శిక్షణ అందించారు.