JN: కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్ నివాసంపై ఈడీ దాడులను ఖండిస్తూ.. పాలకుర్తిలో సీపీఎం నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తుంది అని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం ముఖ్య నాయకులు తదితరులున్నారు.