మెడికో ప్రీతి(Preeti) ఆదివారం రాత్రి 9.16 గంటలకు మృతి చెందినట్లు నిమ్స్(NIMS) వైద్యులు ప్రకటించారు. ఇటీవలె మెడికో ప్రీతి(Preeti) ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెను హైదరాబాద్ నిమ్స్(NIMS)లో చేర్చి చికిత్స అందిస్తుండగా నేడు కన్నుమూసింది. ఆదివారం సాయంత్రం వరకూ కోలుకుంటోందని చెబుతూ వచ్చిన వైద్యులు సాయంత్రం తర్వాత పరిస్థితి విషమించినట్లు తెలిపారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెంది ప్రీతి(Preeti) కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతోంది. పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతి(Preeti) వరంగల్ ఎంజీఎం(MGM) ఆస్పత్రిలో శిక్షణ తీసుకుంటు ఉండగా సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి(Preeti) మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఎమెర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహిస్తున్న ప్రీతి(Preeti) కుప్పకూలిపోయింది. ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్(NIMS)కు తరలించారు. ప్రీతి(Preeti) తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపాయి. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి(Preeti) అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రీతి(Preeti) మృతిచెందినట్లు నిమ్స్(NIMS) వైద్యులు ప్రకటించడంతో ఆస్పత్రి వద్దకు విద్యార్థులు తరలివచ్చారు. పోలీసులు బందోబస్తును పెంచారు. ప్రీతి(Preeti) ని వేధించిన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని ప్రీతి తండ్రి పోలీసులను వేడుకున్నారు. ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో విద్యార్థులు, స్థానిక నాయకులు తరలివచ్చారు. రేపు ప్రీతి(Preeti) అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.