ప్రకాశం: హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుటకు, ప్రచారం చేయుటకు మార్కాపురం జిల్లా కో-ఆర్డినేటర్‌గా గోపాలుని హరిహరరావును నియమించారు. ఆయన గత 30 సంవత్సరాల నుంచి హిందూ ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిరిడి సాయిబాబా మందిరం దత్త మందిరం చంద్రమౌళీశ్వర ఆలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు.