KMR: జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొదలు కానుండడంతో అన్నదాతల గుండెల్లో కొత్త ఆశలు చిగురించాయి. కంటినిండా కురిసే వానల కోసం నింగి వైపు చూస్తూనే.. నమ్మకంతో సాగుకు సన్నద్ధం అవుతున్నారు.సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని అన్నదాతలు అధికారులను కోరుతున్నారు. ఎరువుల కోసం తెల్లవారుజాము నుంచే దుకాణాల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు.