మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేస్తూ.. మార్ఫింగ్ వీడియోలను SMలో వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చిరంజీవి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, ఆయన ఆరోగ్యంపై తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలు, ఫొటోలను యూట్యూబ్ ఛానెల్ ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలో న్యాయవాది రామకృష్ణ మిర్యాల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.