ATP: అనంతపురం రూరల్ మండలం కందుకూరులో నష్టపోయిన దానిమ్మ పంటను సిపిఐ, రైతు సంఘం నాయకులు మంగళవారం పరిశీలించారు. రైతు రవి శేఖర్ రెడ్డి తోటతో పాటు గ్రామంలో దాదాపు 20 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.