SRPT: నడిగూడెం మండల కేంద్రంలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో హోటళ్లు, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల మార్కెట్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు ఎస్సై గంధమల్ల అజయ్ కుమార్ తెలిపారు.