HNK: నగరంలోని అంబేద్కర్ భవన్లో బూత్ లెవల్ ఏజెంట్స్ (BLA) ముఖాముఖి అవగాహన సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కడియం కావ్య, వరంగల్ వెస్ట్ MLA నాయిని రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, సంబందిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓటర్ల జాబితా సవరణ, బూత్ స్థాయి ప్రక్రియలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.