SDPT: బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తహసీల్దార్ శ్రీకాంత్, సీఐ విద్యాసాగర్, ఎస్సై తోట తిరుపతి పాల్గొని బాలికల విద్య, రక్షణ, సమాన హక్కుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.