మార్కాపురంలో స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ‘ల్యాబ్ ఆన్ వీల్స్’ బస్సు ద్వారా మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్‌లో శిక్షణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు, ఎంఈవో రామదాసు నాయక్ పాల్గొన్నారు. విద్యార్థులకు సాంకేతికను పరిచయం చేశారు.