MBNR: విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని MEO మంజులాదేవి అన్నారు. జడ్చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత నోటు పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు. విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.