»Today Is Tirupatis Birthday The City Is Ready For Celebrations
Tirumala Tirupathi: నేడు తిరుపతి పుట్టినరోజు..వేడుకలకు సిద్ధమైన నగరం
ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం తిరుమల(Tirumala). అటువంటి తిరుమల తిరుపతి(Tirupathi) నగరంలో ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి(Tirupathi) నేడు పుట్టినరోజు(Birthday) జరుపుకుంటోంది. దాదాపు 9 శతాబ్దాల వయసున్న ఈ టెంపుల్ సిటీ(Temple city) తన బర్త్ డే సందర్భంగా వేడుకలు జరుపుకుంటోంది.
ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం తిరుమల(Tirumala). అటువంటి తిరుమల తిరుపతి(Tirupathi) నగరంలో ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి(Tirupathi) నేడు పుట్టినరోజు(Birthday) జరుపుకుంటోంది. దాదాపు 9 శతాబ్దాల వయసున్న ఈ టెంపుల్ సిటీ(Temple city) తన బర్త్ డే సందర్భంగా వేడుకలు జరుపుకుంటోంది. తిరుపతి(Tirupathi) పుట్టినరోజు వెనకున్న ఆ చరిత్రేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమహావిష్ణువు స్వయంభుగా తిరుమలలో అవతరించారు. అలా స్వయంభుగా అవతరించిన 8 క్షేత్రాలలో తిరుమల తిరుపతి(Tirupathi) ఒకటి. రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి(Tirupathi) నగర చరిత్ర మొదలైంది.
1130వ సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తేదిన సౌమ్య నామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి ఉత్తరా నక్షత్ర సోమవారం రోజు తిరుపతి(Tirupathi) ఏర్పాటైంది. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీవారి పాదాల చెంత తిరుపతి(Tirupathi) నగరం ఇలా వెలసింది. 893 ఏళ్ల క్రితం ఇదే రోజు శ్రీ వైష్ణవ సస్యాసి అయిన రామానుజాచార్యులు తిరుపతి(Tirupathi) నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయాన్ని పునాది వేసి ప్రారంభించారు. తిరు నగరిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బాటలు వేశారు. పట్టణ అభివృద్ధి ఆ తర్వాత పుంజుకుంది.
తిరుపతి(Tirupathi) నగరానికి 1130 ఫిబ్రవరి 24న రామానుజాచార్యులు శంకుస్థాపన చేసినట్లు రుజువులతో సహా వెల్లడైంది. టీటీడీ(TTD) ఆధ్వర్యంలోని గోవిందరాజ ఆలయంలో అవి వెలుగులోకి వచ్చాయి. గోవిందరాజపట్నంగా ఆ తర్వాత రామానుజాపురంగా తిరుపతి(Tirupathi)ని పిలుస్తారు. తిరుపతి 12వ శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నట్లు ఎన్నో ఆధారాలు వెలుగులోకొచ్చాయి. తిరుపతి(Tirupathi) పుట్టినరోజు సందర్భంగా నగర వాసులు నేడు గోవిందరాజస్వామి ఆలయం వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించి వేడుకలు జరుపుకోనున్నారు.