AP: సుప్రీంకోర్టులో 2018 గ్రూప్-1 నియామకాలపై విచారణ చేపట్టారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ అభ్యర్థులు పిటిషన్ వేశారు. అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలన్న ఆదేశాలపై పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు కొట్టివేసింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగానే ఉన్నాయని తెలిపింది. ప్రాధాన్య పోస్టులు లేకపోతే ఉద్యోగాలు చేయలేరా? ఎక్కడ ఉన్నా జీతం వస్తుంది.. సంతృప్తి పడాలని పేర్కొంది.