CTR: జిల్లాలో నేటి నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది.