HYD: హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో రోగుల కోసం ‘సిటిజన్స్ చార్టర్’ బోర్డును ప్రదర్శించారు. ఉదయం 8:30 నుంచి 11:30 వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండగా, అత్యవసర సేవలు 24 గంటలు కొనసాగనున్నాయి. సందర్శకులకు ఉదయం 6 నుంచి 9, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. పరీక్షలు, శస్త్రచికిత్సల సమయాలను కూడా బోర్డులో వెల్లడించారు.