NTR: విజయవాడ సాంబమూర్తి రోడ్డులో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు, వర్షం కారణంగా భారీ చెట్లు రోడ్డుపై కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ సుధాకర్, ఎస్సై కుమార్ తమ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.