SRCL: సిరిసిల్ల బి.వై నగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం మార్కండేయ పురాణ ప్రవచనాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీక్షితానంద భారతి మాత ముఖ్య అతిథిగా పాల్గొని ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. ఆమెకు ఆలయ నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.