Sansad Ratna వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి అవార్డు
పత్రిక, టీవీ వ్యవహారాలు దగ్గరుండి విజయ సాయిరెడ్డి చూసుకున్నారు. వైఎస్సార్ మరణం జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీ పెట్టాడు. అప్పటి నుంచి పార్టీలో కీలక నాయకుడిగా విజయ సాయిరెడ్డి మారాడు. అప్పటి వరకు తెర వెనుక ఉన్న ఆయన అనంతరం తెర ముందుకు వచ్చాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి అత్యంత సన్నిహితుడైన విజయ సాయిరెడ్డి (Vijayasai Reddy)కి ఓ జాతీయ అవార్డు లభించింది. ఉత్తమ సేవలు అందించినందుకు గాను అవార్డును ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన 16 అవార్డుల్లో ఏపీకి చెందిన విజయ సాయికి అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడంపై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి సామాజిక మాధ్యమాల (Social Media) వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం (Govt Of India) పార్లమెంట్ (Parliament)లో సభ్యుల పనితీరు ఆధారంగా సన్ సద్ రత్న (Sansad Ratna) అవార్డులను ప్రకటిస్తుంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) సలహా మేరకు ఈ అవార్డులను అందిస్తున్నారు. తాజాగా 2023 ఏడాదికి గాను జ్యూరీ 16 మందికి అవార్డులు ప్రకటించింది. వారిలో 13 మంది ఎంపీలతో పాటు రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, 1 లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ (జీవన సాఫల్య పురస్కారం) అవార్డులను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఈ అవార్డుల్లో కేంద్రానికి అనునిత్యం మద్దతు తెలుపుతున్న వైఎస్సార్ సీపీకి చెందిన విజయ సాయిరెడ్డికి ఒకటి లభించింది. ప్రస్తుతం విజయ సాయి రాజ్యసభ తరఫున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ కోటాలో అవార్డు లభించింది.
13వ ఎడిషన్ అవార్డులను మార్చి 25వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు రావడంపై విజయ సాయిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు ఉత్సాహంతో మరింత బాధ్యతగా పని చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ఓ పోస్టు చేశారు. కాగా ఈ అవార్డులను పార్లమెంట్ లో సభ్యుల పనితీరు, వారి వివరాలు ఆధారంగా ఇస్తారు. దీనికోసం ప్రత్యేకంగా డేటా సేకరించేందుకు ఓ బృందం ఉంది. కాగా ఈ అవార్డు రావడం కూడా రాజకీయ దుమారం రేపింది. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు డిమాండ్ చేయకుండా మౌనంగా ఉన్నందుకు విజయ సాయిరెడ్డికి ఈ అవార్డు ప్రకటించారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర సమస్యలపై ఏనాడూ పార్లమెంట్ లో విజయ సాయిరెడ్డి నోరు మెదపలేదన్నారు.
The Sansad Ratna Award being conferred on the Standing Committee on Transport, Tourism & Culture belongs to all the members of the committee and also its past chairpersons. I shall endeavour to carry forward the good work of the committee for tangible benefit of our people.
సీఎం జగన్ కు విజయ సాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. ప్రతిపక్షాలు ఆరోపించే తాడేపల్లి బ్యాచ్ లో ఈయన కీలకం. సాక్షి పెట్టినప్పటి నుంచి జగన్ కు తోడుగా ఉంటున్నాడు. పత్రిక, టీవీ వ్యవహారాలు దగ్గరుండి విజయ సాయిరెడ్డి చూసుకున్నారు. వైఎస్సార్ మరణం జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీ పెట్టాడు. అప్పటి నుంచి పార్టీలో కీలక నాయకుడిగా విజయ సాయిరెడ్డి మారాడు. అప్పటి వరకు తెర వెనుక ఉన్న ఆయన అనంతరం తెర ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈయన కనుసన్నల్లో పార్టీ, ఏపీ ప్రభుత్వ వ్యవహారాలు కొనసాగుతున్నాయని ప్రతిపక్షాల మాట.
అవార్డులు ఇలా.. లోక్ సభ
అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్)
గోపాల్ చిన్నయ శెట్టి (బీజేపీ, మహారాష్ట్ర)
సుధీర్ గుప్తా (బీజేపీ, మధ్యప్రదేశ్)
డాక్టర్ అమోల్ రామ్ సింగ్ కొల్హే (ఎన్సీపీ, మహారాష్ట్ర)
బిద్యుత్ బరన్ మహతో (బీజేపీ, జార్ఖండ్)
డాక్టర్ సుకంత మజుందర్ (బీజేపీ, పశ్చిమ బెంగాల్)
కుల్దీప్ రాయ్ శర్మ (కాంగ్రెస్, అండమాన్ నికోబర్
డాక్టర్ మీన విజయకుమార్ గవిత్ (బీజేపీ, మహారాష్ట్ర)
రాజ్యసభ
ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్ (ఎన్సీపీ, మహారాష్ట్ర)
డాక్టర్ జాన్ బ్రిట్టస్ (సీపీఐ-ఎం, కేరళ)
డాక్టర్ మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ, బిహార్)
విశంభర్ ప్రసాద్ నిషద్ (ఎస్పీ, ఉత్తరప్రదేశ్)
ఛాయ వర్మ (కాంగ్రెస్, చత్తీస్ గఢ్)
స్టాండింగ్ కమిటీ
విజయ సాయిరెడ్డి
జయంత్ సిన్హా
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవన సాఫల్య పురస్కారం
టీకే రంగరాజన్, రాజ్యసభ మాజీ సభ్యుడు (సీపీఐ-ఎం, కేరళ)