ఎక్స్ఛేంజీ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రూపాయి విలువ అనేక అంతర్జాతీయ అంశాలు, మార్కెట్లపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడూ ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితేయ.. రెండు, మూడు రోజులుగా చూస్తే రూపాయి బలపడుతుండటాన్ని గమనించవచ్చని అన్నారు.