»Young Boy Urinates On Woman Passenger In Karnataka Bus
Peeing మొన్న విమానం.. నేడు బస్సు: మహిళపై తాగుబోతు మూత్ర విసర్జన
మద్యంమత్తులో ఉన్నవారు నానా రచ్చ చేస్తున్నారు. ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్యన వీరి ఆగడాలు ఉండేవి. ఇప్పుడు తప్ప తాగి బయటకు వచ్చి బీభత్సం చేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం లభిస్తుండడంతో మద్యం సేవించి దాడులకు తెగబడుతున్నారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు, విమానాల్లో మద్యం సేవించి ప్రయాణం చేయవద్దనే నిబంధనలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
మద్యం మత్తు (Drunk)లో చేసే పనులు దారుణంగా ఉంటున్నాయి. తాగి బయటకు వచ్చి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. మత్తులో దారుణాలకు తెగబడుతున్నారు. మానభంగాలు, హత్యలు, గొడవలకు పాల్పడడంతో పాటు తోటి వారికి ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల విమానం (Flight Urinate Incident)లో ఓ వ్యక్తి మూత్ర విసర్జన సంఘటన మరువకముందే మరో చోట ఇలాంటి సంఘటనే జరిగింది. కాకపోతే అది విమానంలో కాదు.. ఆర్టీసీ బస్సు (RTC Bus)లో జరగడం గమనార్హం. మహిళా ప్రయాణికురాలి (Women Passenger)పై మూత్ర విసర్జన (Peeing)కు పాల్పడిన వ్యక్తి ఇంజనీర్ (Engineer Graduate) కావడం విశేషం. ఆ విద్యార్థిని తోటి ప్రయాణికులు దేహశుద్ధి చేసి బస్సులో నుంచి నెట్టివేసిన సంఘటన కర్ణాటక (Karnataka)లో చోటుచేసుకుంది.
విజయపుర (Vijayapura) నుంచి మంగళూరు (Mangaluru)కు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ (KSRTC) బస్సును ఇంజనీరింగ్ విద్యార్థి రామప్ప (25) ఎక్కాడు. అయితే అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు. ఆ బస్సు హుబ్బళి సమీపంలోని కిరేసూరులోని ఓ దాబా వద్ద మంగళవారం అర్ధరాత్రి కొద్దిసేపు ఆగింది. ప్రయాణికుల్లో కొందరు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కిందకు దిగారు. టీ తాగేందుకు కొందరు కిందకు దిగగా.. మరికొందరు బస్సులోనే నిద్రిస్తున్నారు. 28వ సీటులో నుంచి నిద్రలేచిన రామప్ప కిందకు దిగకుండా ముందు వరుసలో నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. మేలుకున్న ఆమె కేకలు వేసింది. అతడి దుశ్చర్యకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏం జరిగిందోనని తోటి ప్రయాణికులు, బస్సు డ్రైవర్, సహాయకుడు లోపలకి చేరుకున్నారు. ఆ దుండగుడి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. అతడి సామగ్రిని ఇచ్చేసి అతడిని బస్సు నుంచి దింపేశారు.
అయితే మూత్ర విసర్జనతో ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో దాబా (Daba)లో ఆమె స్నానం చేసి దుస్తులు మార్చుకోవడానికి ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్ సహకరించారు. దాదాపు ఓ గంట సేపు బస్సును నిలిపి ఉంచారు. అయితే ఈ సంఘటనపై మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. ఆమె వినతి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కండక్టర్ తెలిపాడు. మద్యంమత్తులో ఆ యువకుడు చేసిన పనిపై ఆర్టీసీ తీవ్రంగా పరిగణించిందని సమాచారం. అతడి వివరాలు తెలుసుకుని అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
మద్యంమత్తులో ఉన్నవారు నానా రచ్చ చేస్తున్నారు. ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్యన వీరి ఆగడాలు ఉండేవి. ఇప్పుడు తప్ప తాగి బయటకు వచ్చి బీభత్సం చేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం లభిస్తుండడంతో మద్యం సేవించి దాడులకు తెగబడుతున్నారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు, విమానాల్లో మద్యం సేవించి ప్రయాణం చేయవద్దనే నిబంధనలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజా సంఘటనల నేపథ్యంలో ప్రయాణికులు మద్యం సేవించి వస్తే ప్రయాణానికి అనుమతించకూడదనే నిబంధన తీసుకురాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి నిర్ణయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తే మంచిది.