TG: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉపాధ్యాయ MLC మల్క కొమురయ్య విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు, స్పష్టమైన సూచనలున్నా.. సర్కారు వద్ద సరైన ప్రణాళిక లేకే కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఏర్పడిందన్నారు. త్వరలో ‘రైతు గోస – బీజేపీ భరోసా’ పేరుతో రైతుల కల్లాలను సందర్శిస్తామని చెప్పారు.