W.G: ఉండి మండలం వాండ్రం ఎన్ఆర్పీ అగ్రహారం సచివాలయాలను, సంపద తయారీ కేంద్రాలను డీపీవో వై.దోసి రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలోని రికార్డులను, పరిశుద్ధ నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాభివృద్ధి జరుగుతుందని సూచించారు.