ఎండలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు శుభవార్త. నైరుతి రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. తాజా శాటిలైట్ చిత్రాల ప్రకారం రుతుపవన మేఘాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో దట్టంగా ఆవరించి ఉన్నాయని.. ఇవి కేరళ వైపు కదులుతూ వేగంగా బలపడుతున్నాయని IMD పేర్కొంది. దీని వల్ల దేశంలోకి అనుకున్న సమయానికే రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది.