కామారెడ్డి జిల్లాకు కేటాయించిన 12,090 ఇందిరమ్మ ఇండ్లలో 11,592 మంజూరు కాగా 9,121 ఇండ్లు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో జిల్లా 10వ స్థానంలో నిలిచిందని, ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.210.57 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 1,532 ఇండ్ల నిర్మాణాలను అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.