VSP: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ ‘ప్రజల కథ.. నా ఆత్మకథ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 24న మద్దిలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తెలిపారు. శుక్రవారం విశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరు కానున్నారు.