BHNG: భూదాన్ పోచంపల్లి మండలంలోని దోతిగూడెం నుంచి పోచంపల్లికి వచ్చే మిషన్ భగీరథ పైప్లైన్ భీమనపల్లి గ్రామ శివారులో పగిలి తాగునీరు వృథాగా పోతుంది. నెల రోజులుగా పైప్లైన్ లీకేజీ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.