BHPL: కాళేశ్వరం పుణ్యక్షేత్రం సమీపంలో పురాతన కళాఖండాల సంరక్షణ కోసం రూ. 1.20 కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మించారు. ఇందులో మొత్తం 17 విగ్రహాలను ఏర్పాటు చేశారు. గణపతి, నంది, చతుర్ముఖ లింగం, శివుడు, చెన్నకేశవ, సూర్య విగ్రహాలు సహా వివిధ శిల్పాలు ప్రదర్శనలో ఉన్నాయి. క్షేత్ర పాలక శివుడు, నాగ ద్వార పాలకుల విగ్రహాలు కూడా భక్తులను ఆకర్షిస్తున్నాయి.