TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. ఉదయం 8:45 గంటలకు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వేద పాఠశాల నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. కొండపై అత్యాధునిక వసతులతో భారీ కళ్యాణ మండపం, స్వామివారి దీక్షాపరుల సదనం నిర్మాణాలకు కూడా ఆయన పునాదిరాళ్లు వేయనున్నారు.