AP: రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఇవాళ రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.