ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ప్రస్తుతం పంటలు నూర్పిడి చేస్తున్న రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే ఐదు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 39.2 – 39.8 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.