WGL: గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటగండి మైసమ్మ ఆలయం–పోతురాజుపల్లి రోడ్డులో బిహార్ వ్యక్తులు దాడులు చేస్తున్నారన్న సోషల్ మీడియా ప్రచారం అసత్యమని గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. అలాంటి ఘటనపై అధికారిక సమాచారం లేదన్నారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.