AP: సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంగా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామానికి చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదిక ద్వారా ఈ హెల్త్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తారు.